
నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వచ్చిన క్రేజీ మూవీ గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ నెల 13న రిలీజైన ఈ సినిమా మొదటిషో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా కలక్షన్స్ పై ఆ ప్రభావం కనిపించలేదు. ఇక వాల్మీకి (గద్దలకొండ గణేష్) వస్తే నాని సినిమాకు కష్టమే అనిపించగా వరుణ్ తేజ్ సినిమా వచ్చిందో లేదో నాని సినిమా కలక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి.
లాస్ట్ ఫ్రైడే రిలీజైన నాని గ్యాంగ్ లీడర్ సినిమా మొదటి వారాంతరం బాగానే కలెక్ట్ చేసినా మండే నుండి అసలు సీన్ అర్ధమైంది. ఆశించిన స్థాయిలో గ్యాంగ్ లీడర్ కలక్షన్స్ లేవు. అయితే వరుణ్ తేజ్ సినిమా వస్తే ఆమాత్రం కూడా కష్టమే అని భావించగా నిన్న రిలీజైన గద్దలకొండ గణేష్ సినిమా హిట్ టాక్ రావడంతో నాని గ్యాంగ్ లీడర్ కు మరింత కష్టంగా మారింది. మరి సినిమా చూస్తే హిట్ టాక్ రాగా కలక్షన్స్ మాత్రం ఎందుకు ఇలా డ్రాప్ అయ్యాయో అని గ్యాంగ్ లీడర్ చిత్రయూనిట్ తలలు పట్టుకున్నారు.