
అదేంటి చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది కదా మరి చిరంజీవి కాకుండా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వేరే వాళ్లు అయ్యే ఛాన్స్ లేదు కదా అని ఆశ్చర్యపడొచ్చు. ఒక్క తమిళంలోనే కాదు హింది, మళయాళ, కన్నడ భాషల్లో కూడా నరసింహా రెడ్డి అంటే అది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. అయితే సైరా సినిమా డబ్బింగ్ వర్షన్ లో కొన్ని మార్పులు ఉంటాయట.
సైరా నరసింహా రెడ్డి తమిళ వర్షన్ లో నరసింహా రెడ్డి పాత్రకు చిరు డబ్బింగ్ చెప్పట్లేదట. తెలుస్తున్న సమాచారం ప్రకారం హీరో కం విలన్ అరవింద్ స్వామి సైరా పాత్రకు డబ్బింగ్ చెబుతారట. తమిళంలో అరవింద్ స్వామికి మంచి క్రేజ్ ఉంది. సైరాకు ఆయన వాయిస్ ఇస్తే అలా కూడా సినిమాకు ప్లస్ అవుతుందని అరవింద్ స్వామిని ఎంపిక చేశారట. ఆల్రెడీ రాం చరణ్ ధ్రువ సినిమాతో తెలుగులో కూడా విలన్ గా నటించి మెప్పించారు అరవింద్ స్వామి. ఆ సినిమా టైంలోనే రాం చరణ్ తో మంచి రిలేషన్ ఏర్పడింది. అందుకే అరవింద్ స్వామిని కూడా సైరాలో భాగం చేస్తున్నారట. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి క్రేజీ స్టార్స్ ఈ సినిమాలో నటించారు.