బిగ్ బాస్ 3 : అలికి భార్య స్వీట్ వార్నింగ్

బిగ్ బాస్ 3 తెలుగులో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ గా ఉన్న అలి, శ్రీముఖిలు ఈమధ్య హౌజ్ లో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారన్న విషయం తెలిసిందే. యాంకర్ గా శ్రీముఖి అందరితో జోవియల్ గా ఉంటుంది. అయితే అలి, శ్రీముఖిల మధ్య క్లోజ్ నెస్ ఉన్నా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది అనుకున్నారు. కాని శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల దగ్గర నుండి లెటర్స్ రూపంలో మెసేజ్ వచ్చింది.    

అందరికి పాజిటివ్ గానే మెసేజెస్ రాగా అలికి మాత్రం ఆట బాగానే ఆడుతున్నావని చెబుతూ బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నావ్ మర్చిపోయావేమో నీకు ఇంట్లో భార్య ఉంది అంటూ సెటైరికల్ గా మెసేజ్ రాశారు. అంతేకాదు నీమీద పెట్టుకున్న నమ్మకం నిజమని నమ్ముతున్నామంటూ అలి భార్య ఎమోషనల్ గా మెసేజ్ రాసింది. సో శ్రీముఖితో క్లోజ్ గా ఉండటం వల్లే అలికి తన ఇంటి నుండ్ ఇలాంటి మెసేజ్ వచ్చిందని చెప్పొచ్చు. అందుకే ఆ మీటింగ్ తర్వాత బాధపడుతున్న శ్రీముఖిని శివ జ్యోతి ఓదార్చడానికి రాగా తనకు సోలోగా ఆడే దమ్ము ఉందని చెప్పింది. కొద్దిరోజులు అలితో దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి అలి రెజా ఇంటి నుండి వచ్చిన లెటర్ అతనికి శ్రీముఖికి మధ్య దూరాన్ని పెంచిందని చెప్పొచ్చు.