
ఎఫ్-2 హిట్ తర్వాత వెంకటేష్, మజిలీ సూపర్ హిట్ తర్వాత నాగ చైతన్య కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ వెంకీ మామ. జై లవ కుశతో తన సాత్తా చాటిన కె.ఎస్ రవింద్ర అలియాస్ బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు నిర్మిస్తున్న వెంకీ మామ సినిమా అక్టోబర్ 25న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అక్టోబర్ 2న సైరా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
అక్టోబర్ 8 దసరా ఉన్నా ఆ టైంలో వస్తే కలక్షన్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే సైరా రిలీజ్ అయిన రెండు వారాల గ్యాప్ తో వెంకీమామ వస్తున్నాడు. వెంకటేష్, చైతన్య కలిసి చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.