సైరా ఈవెంట్ స్పెషల్ గెస్ట్ ఎవరంటే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు చిత్రయూనిట్. తెలుగు, తమిళ, హింది, మళయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు.

టీజర్ రిలీజ్ ముంబైలో జరుపగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తెలుగు రెండు రాష్ట్రాల్లో రెండు వేరు వేరు ప్రాంతాల్లో జరుపుతారట. ముందుగా కర్నూలులో సైరా నరసిం హా రెడ్డి ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత రిలీజ్ మరో వారం ఉందనగా హైదరాబాద్ లో మరో ఈవెంట్ ఉంటుందట. అయితే కర్నూలు ఈవెంట్ లో చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు పవన్ ఈవెంట్లకు చిరు గెస్ట్ గా వస్తాడు. కాని ఈసారి చిరు సినిమా ఈవెంట్ కు పవన్ రాబోతున్నాడు. ఇదే వేడుక మీద రాం చరణ్ కూడా ఉంటాడు. అందుకే మెగా హీరోలందరు ఈ ఈవెంట్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మెగా హీరోలంతా ఒకే వేదిక మీద చూడాలన్న మెగా ఫ్యాన్స్ కోరిక ఇన్నాళ్లకు నెరవేరుతుందని చెప్పొచ్చు.