ఆ సినిమాలు హిట్టై ఉంటే..!

ఎంత పెద్ద సినిమా అయినా సరే ప్రేక్షకుడికి నచ్చితేనే సూపర్ హిట్. కోట్లు బడ్జెట్ పెట్టిన సినిమా అయినా సరే ఆడియెన్స్ మెప్పు పొందకపోతే అది వేస్ట్ అన్నట్టే. అయితే కొన్ని సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా సరే ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంటాయి. అలాంటి వాటి గురించి అప్పుడప్పుడు కొందరు ప్రస్థావిస్తారు. లేటెస్ట్ గా తెలుగులో హిట్ అవ్వాల్సిన కొన్ని సినిమాల గురించి ట్వీట్ చేశాడు నాగ్ అశ్విన్.  

మహానటి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ దర్శకుడు ఖలేజా, లీడర్, పంజా, ఆరెంజ్, అందాల రాక్షసి, డియర్ కామ్రేడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయితే ఇండస్ట్రీ గమనాన్ని మార్చి ఉండేవని అన్నారు. ముఖ్యంగా ఖలేజా సినిమా క్లిక్ అయితే త్రివిక్రం రైటింగ్ మరో స్థాయికి వెళ్లేదని.. వీటితో పాటుగా తన ఆల్ టైం ఫేవరేట్ ఆపద్బాందవుడు సినిమా అంటూ ట్వీట్ చేశాడు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ చెప్పాడని కాదు కాని ఆయన పైన ప్రస్థావించిన సినిమాలన్ని కొంతమంది ప్రేక్షకులకు నచ్చినవే.. కాని బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయితేనే హిట్ అంటారు కబట్టి ఈ సినిమాలు ఫెయిల్ అయ్యాయి.