
యువ హీరో విజయ్ దేవరకొండ హీరోగానే కాదు నిర్మాతగా కూడా సత్తా చాటాలని చూస్తున్నాడు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో తనని హీరోగా పెట్టి సినిమా తీసిన తరుణ్ భాస్కర్ ను హీరోని చేస్తూ విజయ్ నిర్మిస్తున్న సినిమా మీకు మాత్రమే చెప్తా. ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసే ఓ అబ్బాయి గాళ్ ఫ్రెండ్ ముందు మాత్రం తనకు ఎలాంటి అలవాట్లు లేవన్నట్టు కటింగులు ఇస్తుంటాడు.
మరి అలాంటి హీరో జీవితానికి వచ్చిన సమస్యలు ఏంటన్నదే మీకు మాత్రమే చెప్తా సినిమా కాన్సెప్ట్. ఈ సినిమాను షమ్మీర్ సుల్తాన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అనసూయ కూడా స్పెషల్ రోల్ లో నటిస్తుంది. అభినవ్, నవీన్ జార్జ్ కూడా తరుణ్ ఫ్రెండ్స్ గా నటిస్తున్నారు. టీజర్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తున్నారు.