
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వచ్చిన సినిమా సాహో. యువి క్రియేషన్స్ 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 320 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో రిలీజైంది. సినిమా మొదటిషో నుండి డివైడ్ టాక్ రాగా కలక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో సాహో సేఫ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇక లాస్ట్ ఫ్రైడే రిలీజైన సాహో వారం రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో 74.24 కోట్లు రాబట్టింది.
బాలీవుడ్ లో 100 కోట్లకు సాహో రైట్స్ కొనగా.. 120 కోట్లతో అక్కడ సూపర్ హిట్ అనిపించుకుంది. తమిళ వర్షన్ ఆల్రెడీ డిజాస్టర్ అనిపించుకోగా తెలుగు రెండు రాష్ట్రాల్లో వసూళ్లు బాగున్నాయి.
ఏరియాల వారిగా సాహో వారం రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..
నైజాం : 26.24 కోట్లు
ఉత్తరాంధ్ర : 8.94 కోట్లు
సీడెడ్ : 10.79 కోట్లు
కృష్ణ : 4.69 కోట్లు
గుంటూరు : 7.44 కోట్లు
ఈస్ట్ : 6.92 కోట్లు
వెస్ట్ : 5.32 కోట్లు
నెల్లూరు : 3.90 కోట్లు
ఏపి/తెలంగాణా : 74.24 కోట్లు