బాలకృష్ణతో రిస్క్ చేస్తున్న ప్రొడ్యూసర్

ఎన్.టి.ఆర్ బయోపిక్ ఇచ్చిన షాక్ నుండి కోలుకున్న బాలకృష్ణ కొద్దిపాటి గ్యాప్ తో కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సినిమాలో బాలకృష్ణ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తుంది. అందులో ఒకటి అల్ట్రా మోడ్రెన్ లుక్ కాగా మరోటి మాస్ లుక్ అని తెలుస్తుంది. అయితే మాస్ లుక్ ని ఇప్పుడు రివీల్ చేయకుండా సినిమా ప్రమోషన్స్ లో బాలకృష్ణ స్టైలిష్ లుక్ వాడుతున్నారు. 

ఈమధ్యనే ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. రవికుమార్ చెప్పిన కథ డిమాండ్ చేస్తుందని సినిమాకు 30 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేస్తున్నాడట నిర్మాత సి కళ్యాణ్. అయితే ఇది బాలయ్య మార్కెట్ కు మాత్రం ఎక్కువే అని చెప్పొచ్చు. బాలకృష్ణ సినిమా హిట్టైతేనే 30 కోట్ల దాకా రాబట్టే అవకాశం ఉంది. అలాంటిది బడ్జెట్టే అంత పెట్టేస్తే ఎలా అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఏది ఎలా ఉన్నా బాలయ్యతో కళ్యాణ్ రిస్క్ చేస్తున్నాడని చెప్పొచ్చు.