నాని 'గ్యాంగ్ లీడర్' ప్రమోషనల్ సాంగ్

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుండి స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నాని, అనిరుధ్ ఇద్దరు ఈ సాంగ్ లో కనిపించారు. గ్యాంగ్.. గ్యాంగ్.. గ్యాంగ్ లీడర్ అంటూ సినిమాలోని పాత్రల గురించి చెబుతూ ఈ పాట వస్తుంది.  

అనిరుద్ ట్రెండీ మ్యూజిక్ తో ఈ ప్రమోషనల్ సాంగ్ క్రేజీగా మారింది. సినిమాలో చివర్లో వచ్చే ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా సంగీత ప్రియులతో పాటుగా మాస్ ఆడియెన్స్ కు నచ్చేలా ఈ సాంగ్ ఉంది. ఈ ఇయర్ ఆల్రెడీ జెర్సీతో సూపర్ హిట్ అందుకున్న నాని గ్యాంగ్ లీడర్ తో ఆ హిట్ ఫాం కొనసాగించాలని చూస్తున్నాడు. మరి నాని గ్యాంగ్ లీడర్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగితే సరిపోతుంది.