
సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న హీరో శ్రీ విష్ణు. రీసెంట్ గా బ్రోచేవారెవరురా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు లేటెస్ట్ గా తిప్పరా మీసం సినిమాతో వస్తున్నాడు. కృష్ణ విజయ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను రిజ్వాన్ నిర్మిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టినర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ మెప్పించిందని చెప్పొచ్చు.
ముఖ్యంగా మనిషికి శత్రువు కూడా ఒక వ్యసనమే అనే డైలాగ్ చూస్తుంటే సినిమా ఓ రివెంజ్ స్టోరీ అనిపిస్తుంది. సినిమాలో శ్రీవిష్ణు లుక్ బాగుంది. కంప్లీట్ మాస్ మూవీగా వస్తున్న తిప్పరామీసం సినిమాతో మరోసారి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు శ్రీవిష్ణు. కంటెంట్ ఉంటే చిన్న సినిమాకు కూడా పెద్ద విజయం అందిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఈ తిప్పరా మీసం ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.