సాహోపై ప్రభాస్ రెస్పాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వచ్చిన సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 350 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతుంది. సినిమా వరల్డ్ వైడ్ గా 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సందర్భంగా ప్రభాస్ తన ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులను ఉద్దేశించి ఓ మెసేజ్ పెట్టాడు. తన సోషల్ బ్లాగ్ లో ప్రభాస్ సాహో రిజల్ట్ పై స్పందించాడు.    

ప్రియమైన అభిమానులు.. ప్రేక్షకులు.. సాహోపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. మీ వల్లే సినిమాకు విశేషమైన స్పందన.. అప్రిషియేషన్స్ వస్తున్నాయని.. మీ ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ప్రభాస్ ఇన్ స్టాగ్రాంలో మెసేజ్ పెట్టారు. మొదటిరోజు టాక్ బాగాలేకున్నా సాహో కలక్షన్స్ మాత్రం కొన్ని ఏరియాల్లో బాగానే ఉన్నాయి. ప్రభాస్ సినిమా టాక్ బాగాలేకపోతేనే ఈ రేంజ్ కలక్షన్స్ ఉంటే ఒకవేళ సినిమా బాగుంటే పరిస్థితి ఎలా ఉండేదో అని అనుకుంటున్నారు.