చిత్రపురిలో ఇళ్లు.. వాళ్లకు అండగా ఉంటానన్న పవన్..!

సినిమా వాళ్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కడం లేదని కొందరు జూనియర్ ఆర్టిస్టులు, కాస్టూమర్లు, ఫైటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్రపురిలో అలాంటి వారి కోసమే ఇళ్లు నిర్మిస్తారు అయితే అవి సినిమాకు సంబంధం లేని వారు కాజేస్తున్నారని జూనియర్ ఆర్టిస్టులు అంటున్నారు. ఈ క్రమంలో చిత్రపురి సాధన సమితి సభ్యులు హైదరాబాద్ జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు.

చిత్రపురిలో ఇళ్లు దక్కక ఇబ్బంది పడుతున్న వారికి తను అండగా ఉంటానని అన్నారు పవన్ కళ్యాణ్. ఈ అంశంపై ఎన్.శంకర్, తమ్మారెడ్డి భరధ్వాజ, పరుచూరి వెంకటేశ్వర రావులతో తాను చర్చిస్తానని అన్నారు. హింది సినిమాకు ముంబై కేంద్రంగా ఉన్నట్టుగా తెలుగు సినిమాకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని.. తెలుగు సినిమా వారికి చిత్రపురిలో సొంతింటి కల నెరవేరాలని పవన్ అన్నారు. చిత్రపురిలో ఇళ్లకు సంబందించిన ఈ విషయాలపై రాజకీయ పరంగా కూడా జనసేన సపోర్ట్ ఉంటుందని అన్నారు పవన్ కళ్యాణ్.