
మెగాస్టార్ చిరంజీవి సైరా తర్వాత చేస్తున్న సినిమా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమాను రాం చరణ్ నిర్మిస్తారట. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా గోవా బ్యూటీ ఇలియానాని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా బాలీవుడ్ బాట పట్టాక తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి.
అక్కడ కూడా సరైన గుర్తింపు తెచ్చుకోలేని అమ్మడు సినిమాలకు దూరమైంది. లాస్ట్ ఇయర్ రవితేజ హీరోగా అమర్ అక్బర్ ఆంటొని సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇలియానా. సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ ఆమెను ఎవరు తీసుకోలేదు. అయితే కొరటాల శివ మాత్రం చిరు సినిమాలో ఆమెను హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడని టాక్. ఆల్రెడీ ఫేడవుట్ అయిన ఇలియానాకు ఈ ఛాన్స్ రావడం నిజమే అయితే మాత్రం లక్కీ అని చెప్పొచ్చు. మరి చిరు సినిమాలో ఇలియానా ఉందా లేదా అన్నది చిత్రయూనిట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తేనే తెలుస్తుంది.