నెగటివ్ రోల్ చేస్తున్న హెబ్భా పటేల్..!

కుమారి 21ఎఫ్ సినిమాతో యువతను ఉర్రూతలూగించిన హెబ్భా పటేల్ ఆమెకు వచ్చిన ఆ క్రేజ్ ను తన తర్వాత సినిమాలకు కొనసాగించడంలో విఫలమైంది. లేటెస్ట్ గా నితిన్ భీష్మ సినిమాలో ఛాన్స్ పట్టేసిన హెబ్భా పటేల్ ఆ సినిమాలో నెగటివ్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. హీరోయిన్స్ నెగటివ్ రోల్ చేయడం చాలా అరుదు విలన్ గా హెబ్భా ఓ విధంగా సాహసం చేస్తుందని చెప్పొచ్చు.

ఛలో సినిమాతో సత్తా చాటిన వెంకీ కుడుముల రెండో ప్రయత్నంగా చేస్తున్న సినిమా భీష్మ. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా డియర్ కామ్రేడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ఛలో సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ కాగా దర్శకుడు ఆ సెంటిమెంట్ తోనే తన సెకండ్ మూవీకి ఆమెను హీరోయిన్ గా పెట్టుకున్నాడు.