ఇలాంటి టైంలో సిస్టర్ రోల్ అంటే..!

ఒకప్పటి హీరో కమ్ విలన్ రాజేష్ కూతురు ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా కోలీవుడ్ లో మంచి ఫాంలో ఉంది. లాస్ట్ ఇయర్ కనా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఐశ్వర్యా రాజేష్ ఆ సినిమాతో మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది. కౌసల్యా కృష్ణమూర్తి టైటిల్ తో కనా రీమేక్ అవగా సినిమాలో ఐశ్వర్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఐశ్వర్యా రాజేష్.   

ఇక ఆ సినిమాతో పాటుగా నమ్మవీట్టు పిళ్లై అనే తమిళ సినిమాలో కూడా నటిస్తుంది. ఆ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తుండగా అందులో అతని సిస్టర్ పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. కోలీవుడ్ లో హీరోయిన్ గా మంచి ఫాం కొనసాగిస్తున్న ఐశ్వర్య రాజేష్ సడెన్ గా సిస్టర్ రోల్స్ చేయడం ఏంటని అందరు ఆశ్చర్యపడుతున్నారు. అయితే మనసుకి నచ్చిన పాత్ర వస్తే అది ఎలాంటి పాత్ర అయినా తాను చేస్తా అని అంటుంది ఐశ్వర్యా రాజేష్. ఈ సినిమాతో పాటుగా వెంకట్ ప్రభు హీరోగా చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది ఐశ్వర్యా రాజేష్.