
ఛలో సినిమాతో తెలుగులో సూపర్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో వెంటనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలతో వచ్చినా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది రష్మిక మందన్న. కన్నడ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక రీసెంట్ గా కోలీవుడ్ లో కూడా క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుందని తెలుస్తుంది.
ఇక ఇవే కాదు ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్ కూడా అమ్మడు అందుకుంటుందట. నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ జెర్సీ. ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ లో హీరోయిన్ గా రష్మిక మందన్న సెలెక్ట్ అయ్యిందట. జెర్సీ హింది రీమేక్ కరణ్ జోహార్ కొన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తారు అన్నది అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. రష్మికకు బాలీవుడ్ లో ఇది క్రేజీ ఎంట్రీ అని చెప్పొచ్చు.