
సినిమా వాళ్లు రాజకీయాళ్లోకి రావడం కామన్ అయ్యింది. తెలుగులో అయితే ఇప్పటికే అలా చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటుతున్నారు. ఇదిలాఉంటే ఎన్నిసార్లు అడిగినా సరే తనకు అసలు రాజకీయాలు పడవని చెబుతున్నాడు సూపర్ స్టార్ మహేష్. టాలీవుడ్ లో ప్రతి స్టార్ ఏదో ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు డైరెక్ట్ గా ఫలానా పార్టీకి తమ సపోర్ట్ అని ఒప్పుకుంటే కొందరు మాత్రం తాము ఎవరికి సపోర్ట్ అన్నది చెప్పకుండా దాచిపెడుతుంటారు.
ఈమధ్య మహేష్ డైరెక్ట్ పాలిటిక్స్ లోకి వస్తున్నాడని వార్తలు వచ్చాయి. వాటిపై మరోసారి మహేష్ వివరణ ఇచ్చారు. తన దృష్టి మొత్తం నటన మీదే ఉంది.. వేరే రంగాల్లో అడుగు పెట్టే ఆలోచన అసలు లేదని అన్నారు మహేష్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడే వన్ ఇయర్ స్కూల్ మిస్ అయ్యిందని నాన్న చదువు పూర్తయ్యాకనే సినిమాలు చేయొద్దని అన్నారు. నటన కాకుండా దేనిపై తనకు ఆసక్తి లేదని మరోసారి కచ్చితంగా చెప్పారు మహేష్.