వాల్మీకికి సుక్కు టచ్

హరీష్ శంకర్ డైరక్షన్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అధర్వ, పూజా హెగ్దె లీడ్ రోల్స్ గా నటిస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 20న రిలీజ్ అవుతున్న ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఓ కెమియో రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలో సుక్కు సర్ ప్రైజ్ ఇస్తాడట.

వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. ఈమధ్య రిలీజైన ప్రచార చిత్రాల్లో వరుణ్ తేజ్ నటనకు మెగా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నెగటివ్ రోల్ లో వరుణ్ తేజ్ తన నట విశ్వరూపం చూపించాడని తెలుస్తుంది. సెప్టెంబర్ 13న నాని గ్యాంగ్ లీడర్ వస్తుండగా ఆ తర్వాత వారం వరుణ్ తేజ్ వాల్మీకి వస్తున్నాడు. రెండు సినిమాల మీద మంచి అంచనాలు ఉన్నాయి.