
స్వీటీ అనుష్క ప్రస్తుతం సైలెన్స్ సినిమా చేస్తుంది. కోనా వెంకట్ నిర్మాణంలో మాధవన్, అనుష్క లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా సైలెన్స్. భాగమతి సినిమా తర్వాత అనుష్క చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకుంది. బాహుబలి 2, భాగమతి సినిమాలతో హిట్ అందుకున్న అనుష్క సైలెన్స్ తో కూడా హిట్ మేనియా కొనసాగించాలని చూస్తుంది. సైజ్ జీరో కోసం లావు పెరిగిన అనుష్క ఈమధ్య తన బరువు తగ్గించుకుందని అన్నారు.
రీసెంట్ గా సన్నబడిన అనుష్క ఫోటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే లేటెస్ట్ గా మళ్లీ అనుష్క పిక్ చూసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. రీసెంట్ గా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అనుష్క ఫోటో తీసిన ఓ అభిమాని దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే అది చూసిన ఆడియెన్స్ షాక్ అవుతున్నారు. ఆ పిక్ లో అనుష్క బొద్దుగానే కనిపిస్తుంది. ఈమధ్య తగ్గినట్టే తగ్గిన అనుష్క మళ్లీ బొద్దుగా మారింది. మరి ఇలానే ఉంటే ఆమెకు అవకాశాలు కూడా రావడం కష్టమే.