ఫిల్మ్ చాంబర్ ఎదుట జూనియర్ ఆర్టిస్ట్ నిరసన

జూనియర్ ఆర్టిస్ట్ సునీత బోయ మంగళవారం సాయంత్రం నుండి ఫిల్మ్ చాంబర్ ఎదుట గొలుసులతో తనని తాను బంధించుకుని నిరసన తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం సునీతను అదుపులోకి తీసుకున్నారు. గీత ఆర్ట్స్ లో సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని ఆ ప్రొడక్షన్ హౌజ్ లో చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మించే బన్ని వాసు తనని మోసం చేశారంటూ ఆమె ఆరోపించారు.                    

తనకు ఛాన్సులు ఇవ్వకపోగా తనపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తనకు జరుగుతున్న ఈ అన్యాయానికి అల్లు అరవింద్ స్పందించాలని సునీత డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆమె ఆరోపణల్లో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె పోలీసుల కస్టడీలో ఉన్నారు. సునీత బోయ పెద్దగా పరిచయమున్న ఆర్టిస్టు కూడా కాదు. ఇదవరకు కత్తి మహేష్ పై విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు సడెన్ గా బన్ని వాసు మీద సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది.