RRR అన్ని భాషల్లో అదే స్పెషల్

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమాకు సంబందించిన ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సినిమాలో అజయ్ దేవగన్ స్పెషల్ రోల్ చేస్తుండగా అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో కొమరం భీమ్ గా ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్నారు.    

అయితే ఇప్పటికే తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ పరిశ్రమలో తారక్ నటన గురించి అందరికి తెలుసు. ఆర్.ఆర్.ఆర్ తో మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు తారక్. రాం చరణ్ అయితే ఆల్రెడీ అక్కడ ఓ సినిమా చేశాడు. ఇక తారక్ ట్రిపుల్ ఆర్ లో అన్ని భాషల్లో తానే డబ్బింగ్ చెబుతాడట. తన అభినాయానికి తగినట్టుగా డైలాగ్స్ కూడా పలికిస్తాడు తారక్. అందుకే ఆర్.ఆర్.ఆర్ ప్రతి భాషలో తన డబ్బింగ్ ఇస్తాడట. వేరే భాషల్లో తెలుగు సినిమాలు బాలీవుడ్ లో రిలీజైనా సొంతంగా డబ్బింగ్ చెప్పడం మాత్రం తారక్ వల్లే అవుతుంది. హిందిలోనే కాదు ఆర్.ఆర్.ఆర్ తమిళ, కన్నడ వర్షన్స్ కు ఎన్.టి.ఆర్ ఓన్ వాయిస్ ఇస్తున్నాడట. ఇతర రాష్ట్రాల ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు ఇది పండుగ లాంటి వార్త అని చెప్పొచ్చు.