సాహో రిజల్ట్ పై సుజిత్ రెస్పాన్స్

బాహుబలి తర్వాత ప్రభాస్ లాంటి హీరో మరో స్టార్ హీరోతోనో లేక మరో సక్సెస్ ఫుల్ డైరక్టర్ తోనో సినిమా చేస్తాడని అనుకున్నారు. కాని కేవలం ఒక సినిమా అనుభవం ఉన్న డైరక్టర్ సుజిత్ తో సాహో చేసి సర్ ప్రైజ్ చేశాడు ప్రభాస్. రన్ రాజా రన్ లాంటి సినిమాతో డైరక్టర్ గా ప్రతిభ చాటిన సుజిత్ రెండో సినిమాతోనే నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే రిలీజ్ తర్వాత సాహో టాక్ విన్న సుజిత్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.  

ఫైనల్ గా సుజిత్ ఈరోజు తన ఇన్ స్టాగ్రాం లో ఒక మెసేజ్ కొన్ని పిక్స్ షేర్ చేసుకున్నాడు. తన 17 ఏళ్ల వయసులో మొదటి షార్ట్ ఫిల్మ్ చేశానని.. దానికి డైరక్టర్, కెమెరా వర్క్, ఎడిటింగ్ అన్ని 90 శాతం వరకు తానే చేశానని.. తన ఆర్కుట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వల్లే అది సాధ్యమైందని.. ఇక విమర్శల వల్ల చాలా నేర్చుకున్నానని.. విమర్శలు తనకు ఎక్స్ ట్రా బూస్ట్ ఇస్తాయని అన్నారు సుజిత్. సాహో సినిమా అందరు చూస్తున్నారని.. కొందరు ఎక్కువ అంచనాలతో సినిమాకు వచ్చారని.. అయితే చాలామందికి సినిమా నచ్చిందని.. మళ్లొకసారి చూస్తే సినిమా అర్ధమవుతుందని అన్నారు సుజిత్. ఈ మెసేజ్ తో పాటుగా తన మొదటి షార్ట్ ఫిల్మ్ తీసిన టైం లో తన పిక్స్ కొన్ని షేర్ చేశాడు సుజిత్. సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా సరే వసూళ్ల పరంగా మాత్రం దూసుకెళ్తుంది. ఓ పక్క ప్రభాస్ మాత్రం కలక్షన్స్ పెంచేందుకు సాహోని ప్రమోట్ చేస్తున్నారు.