పవన్ బర్త్ డే కోటి ట్వీట్లు

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సింది ఏమి లేదు. తెలుగులోనే కాదు సౌత్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో పవన్ వస్తాడు. ఈ క్రేజ్ తోనే జనసేన అంటూ ప్రజల తరపున ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు పవన్. ఇదిలాఉంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే. స్టార్ బర్త్ డేలకు ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. పవర్ స్టార్ బర్త్ డేకు ట్విట్టర్ షేక్ చేసేలా బర్త్ డే విశెష్ ట్రెండ్ చేశారు.

హ్యాష్ ట్యాగ్ హ్యాపి బర్త్ డే పవన్ కళ్యాణ్ అనేది సెప్టెంబర్ 2 డే స్టార్టింగ్ 12:00 am నుండి మళ్లీ అర్ధరాత్రి వరకు ఏకంగా 1.05 కోట్లు ట్వీట్స్ వేశారు. కేవలం మొదటి అర్ధగంటలోనే మిలియన్ ట్వీట్స్ వచ్చాయట. 2015 నుండి ఇప్పటివరకు వరుసగా ఐదేళ్లు పవన్ బర్త్ డేని ట్రెండ్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇలా ఐదేళ్లు వరుసగా బర్త్ డే ట్రెండ్ చేసి పవన్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్.