
ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ అజయ్ భూపతి తన సెకండ్ సినిమా నితిన్, రామ్ లతో చేస్తాడని వార్తలు రాగా ఫైనల్ గా మాస్ మహ రాజ్ రవితేజతో ఆ సినిమా కన్ ఫాం అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందట. డిస్కో రాజా రిలీజ్ కాగానే రవితేజ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.
అజయ్ భూపతి ట్విట్టర్ లో చీప్ స్టార్ అంటూ పెట్టిన ఓ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో డిస్కషన్స్ కు దారి తీసింది. ఇంతకీ ఎవర్ని ఉద్దేశించి ఆరెక్స్ డైరక్టర్ అలా చీప్ స్టార్ అన్నాడని డౌట్ రేంజ్ చేస్తున్నారు. ఒకవేళ తనని కాదన్న హీరోలను అన్నాడా లేక ఒకవేళ తను తర్వాత చేసే సినిమా టైటిల్ అదేనా అన్న విధంగా డిస్కషన్స్ చేస్తున్నారు. నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా బర్త్ డే విశెష్ చెప్పిన అజయ్ భూపతి ఆ వెంటనే చీప్ స్టార్ అనడంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మరి చీప్ స్టార్ అంటూ ఎవర్ని ఉద్దేశించి అన్నది అజయ్ భూపతి చెబితేనే కాని తెలియదు.