సైరాపై సాహో ఎఫెక్ట్

ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో రీసెంట్ గా రిలీజైన సాహో సినిమా అంచనాలను అందుకోవడలో ఫెయిల్ అయ్యింది. యువి క్రియేషన్స్ వారు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా టాక్ బాగాలేకున్నా కలక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ఓవర్సీస్, తమిళ, కేరళలో భారీ లాస్ వచ్చేలా ఉంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఇది సేఫ్ ప్రాజెక్ట్ అయ్యేలా ఉంది. ఇక ఈ సినిమా కథ, కథానాలు రొటీన్ గా ఉండటమే మైనస్ అయ్యింది. 

యాక్షన్, మేకింగ్, కమర్షియల్ అంశాలు సినిమాను కొంతవరకు కాపాడాయి. అయితే సాహో సినిమా రిజక్ట్ చూసి త్వరలో రాబోతున్న మరో భారీ మూవీ సైరా పై డౌట్లు రేజ్ అవుతున్నాయి. బాలీవుడ్ లో బీభత్సమైన ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం వరకు బాగానే ఉన్నా అక్కడ ఆడియెన్స్ ను మెప్పించే కథ కూడా ఉండాలన్న విషయం సాహోతో అర్ధమైంది. అయితే సైరా సినిమా ఓ వీరుడి గాథతో వస్తుంది. తప్పకుండా ఈ కథ తెలిసే ఛాన్స్ లేదు.

అయితే సాహో రన్ టైం కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టింది. అందుకే సైరా విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడుతున్నారట. సైరా ఇప్పటికే 3 గంటలు వచ్చిందట. చిరంజీవి చూసి ఫైనల్ కట్ చేయాల్సి ఉందట. మొత్తానికి సాహో చేసిన తొందరపాట్లను సైరా చేయట్లేదు. అక్టోబర్ 2న సైరా రిలీజ్ అవుతుంది. చిరుతో పాటుగా అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్ ఈ సినిమాలో నటించారు.