
అర్జున్ రెడ్డి సినిమాతో కేవలం తెలుగులోనే కాదు సౌత్ అంతటా స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమా మిగతా బాషల్లో రిలీజ్ కాకున్నా అర్ధం కాని తెలుగు సినిమానే చూసి అందులోని విజయ్ దేవరకొండ నటనకు ఫిదా అయ్యారు. ఇక మనవాడి టాలెంట్ ను బాలీవుడ్ నిర్మాతలు కూడా గుర్తించారు. అందుకే విజయ్ దేవరకొండను బాలీవుడ్ లాంచింగ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండను బాలీవుడ్ లాంచ్ చేసే బాధ్యతను ఒకరిద్దరు కాదు ముగ్గురు బడా నిర్మాతలు చేతులు కలుపుతున్నారట. అందులో కరణ్ జోహార్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, సాజిద్ నడియావాలా ఉన్నారట. ముగ్గురు బీ టౌన్ క్రేజీ ప్రొడ్యూసర్ ఈ ముగ్గురు కలిసి విజయ్ ను గ్రాండ్ గా బాలీవుడ్ లాంచ్ చేయబోతున్నారట. ఇప్పటికే బాహుబలి రెండు పార్టులు, సాహో సినిమాలతో ప్రభాస్ బాలీవుడ్ లో పాగా వేయగా ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.