
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా విఐ ఆనంద్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా డిస్కో రాజా. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ లో రాం తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రీసెంట్ గా ప్రీ లుక్ తో సర్ ప్రైజ్ చేసిన రవితేజ ఈరోజు వినాయక చవితి సందర్భంగా డిస్కోరాజాలోని తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఎర్రకోటుతో సింహాసనం మీద ఓ చేతిలో తుపాకి, మరో చేతిలో చుట్టని పట్టుకుని స్టైల్ గా పైకి చూస్తూ నవ్వుతున్నాడు రవితేజ.
టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని మూడు వరుస ఫ్లాపులతో కెరియర్ రిస్క్ లో పడేసుకున్న రవితేజ వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి చేస్తున్న సినిమా డిస్కో రాజా. విఐ ఆనంద్ ఓ డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో సక్సెస్ అందుకున్న డైరక్టర్ విఐ ఆనంద్ అల్లు శిరీష్ తో చేసిన ఒక్కక్షణం సినిమాతో ఫెయిల్ అయ్యాడు. మరి డిస్కో రాజాతో మరోసారి తన సత్తా చాటుతాడో లేదో చూడాలి. రవితేజ మాత్రం తన ఆశలన్ని ఈ సినిమా మీద పెట్టుకున్నాడు.