
హీరోగా ఒకరు సక్సెస్ అయితే ఆ ఫ్యామిలీ నుండి మరో హీరో రావడం కామనే. ఇక అన్న స్టార్ అయ్యాడంటే తమ్ముడు తనంతట తానే హీరోగా ప్రమోట్ చేసుకుంటాడు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా దొరసాని సినిమాతో పరిచయమయ్యాడు. శివాత్మిక హీరోయిన్ గా నటించిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. అయితే హీరోగా ఆనంద్ మాత్రం ఇంప్రెస్ చేశాడు.
ఇక ఇప్పుడు ఆనంద్ దేవరకొండ తన రెండో సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారట. ఈ మూవీతో వినోద్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కోలీవుడ్ హీరోయిన్ వర్ష ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. అసలైతే దేవరకొండ విజయ్ తమ్ముడిని హీరోగా ఓ సినిమా నిర్మిస్తారని వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్ట్ ఏమైందో తెలియదు కాని కొత్త డైరక్టర్ తో ఆనంద్ తన రెండో సినిమా మొదలుపెడుతున్నాడు.