సాహో సినిమాపై కే.టి.ఆర్ రివ్యూ

టి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కే.టి.ఆర్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా సినిమా పరిశ్రమకు తగిన సపోర్ట్ గా ఉంటూ వస్తున్నారు. మహేష్, చరణ్, ఎన్.టి.ఆర్ లకు చాలా క్లోజ్ అయిన కే.టి.ఆర్ అప్పుడప్పుడు సినిమాలు చూడటం వాటికి తన రివ్యూ ఇవ్వడం చేస్తూనే ఉంటారు. లేటెస్ట్ గా కే.టి.ఆర్ ఒకేరోజు రెండు సినిమాలు చూసి ఆ రెండు సినిమాల గురించి తన మాటల్లో చెప్పారు.  

ఇంతకీ కే.టి.ఆర్ చూసిన ఆ రెండు సినిమాలు ఏవి అంటే అందులో ఒకటి సాహో కాగా.. మరొకటి ఎవరు. సాహో టెక్నికల్ గా సూపర్ గా ఉందని.. ఇండియన్ సినిమా స్థాయిని పెంచేలా ఈ సినిమా తెరకెక్కించారని కే.టి.ఆర్ ట్వీట్ చేశారు. ప్రభాస్ తో పాటుగా డైరక్టర్ సుజీత్ కు తన కాంప్లిమెంట్స్ అందించారు. ఇక ఎవరు గురించి కూడా ప్రస్థావించిన కే.టి.ఆర్ బ్రిలియంట్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అని మెచ్చుకున్నారు. సినిమా హీరో అడివి శేష్, రెజినా కసాండ్రా, నవీన్ చంద్ర నటన బాగుందని అన్నారు. సాహో లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అవగా మిక్సెడ్ టాక్ తో రన్ అవుతుంది. ఆగష్టు 15న రిలీజైన ఎవరు సక్సెస్ ఫుల్ టాక్ సొంతంచేసుకుంది. సాహో, ఎవరు సినిమాల మీద కే.టి.ఆర్ ఇచ్చిన రివ్యూ ఆ సినిమాలకు ఎంతో సపోర్ట్ అని చెప్పొచ్చు.