
బాలీవుడ్ లో 12 సీజన్ల నుండి సూపర్ హిట్ అవుతూ వస్తున్న బిగ్ బాస్ షోకి అక్కడ ఒక్కడే హోస్ట్ అతనే కండల వీరుడు సల్మాన్ ఖాన్. బిగ్ బాస్ ను స్టార్ వాళ్లు సౌత్ భాషలకు విస్తరింపచేశారు. అయితే మిగతా భాషల్లో ఎలా ఉన్నా తెలుగులో మాత్రం బిగ్ బాస్ షో కాన్సెప్ట్ ను దెబ్బతీస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా సర్ ప్రైజ్ చేశాడు.
ఇక రెండో సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా అలరించాడు. ఇప్పుడు మూడవ సీజన్ కు కింగ్ నాగార్జున హోస్ట్ గా షో నడిపిస్తున్నాడు. మొదట్లో కాస్త అటు ఇటుగా ఉన్నా బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పుడు ఆసక్తిగానే నడుస్తుంది. ఇదిలాఉంటే ఈ వారం బిగ్ బాస్ షోలో మరో సర్ ప్రైజ్ జరుగుతుంది. హోస్ట్ గా నాగార్జున ప్లేస్ లో రమ్యకృష్ణ షాక్ ఇచ్చారు.
నాగ్ ప్లేస్ లో రమ్యకృష్ణ రావడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. నాగార్జునకు రీసెంట్ గా ఫీవర్ వచ్చి బాగా నీరసపడ్డారట. అందుకే ఈ వారం హోస్ట్ గా చేయడం కుదరలేదు. అందుకే నాగ్ ప్లేస్ లో మరో హీరో దొరకకపోవడంతో శివగామి రమ్యకృష్ణని దించారు. స్పెషల్ హోస్ట్ అంటూ ఈరోజు మధ్యాహ్నం నుండే ప్రోమో వదిలారు. రమ్యకృష్ణ హోస్ట్ గా రావడం ఆడియెన్స్ కు మాత్రమే కాదు కంటెస్టంట్స్ కు పెద్ద షాకే అని చెప్పొచ్చు. ఈ శని, ఆదివారాలు రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తారు.