
ఈ ఇయర్ ఇచ్చిన నేషనల్ అవార్డుల్లో ఎక్కువ శాతం అవార్డులు గెలుచుకున్న సినిమా అంధాదున్. శ్రీరాం రాఘవ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా అద్భుతమైన నటనతో మెప్పించాడు. బాలీవుడ్ లో హిట్టైన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు. అంధాదున్ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 నుండి నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి ఆ సినిమా రైట్స్ కొనేశారట.
ఈ సినిమాను తెలుగులో నితిన్ హీరోగా చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ, వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నితిన్ అంధాదున్ రీమేక్ చేస్తాడని తెలుస్తుంది. అయితే ఈ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది. ఈమధ్యనే చంద్ర శేఖర్ యేలేటి డైరక్షన్ లో కూడా నితిన్ ఓ సినిమా కన్ఫాం చేశాడు. చూస్తుంటే 2020 నితిన్ అదరగొట్టేలా ఉన్నాడని చెప్పొచ్చు.