
శుక్రవారం రిలీజైన సాహో సినినాకు టాక్ ఎలా ఉన్నా వసూళ్లు మాత్రం ఊహించిన రేంజ్ లోనే వచ్చాయి. మొదటి రోజు కలక్షన్స్ కుమ్మేశాడు ప్రభాస్. సాహోగా బాక్సాఫీస్ పై మరోసారి తన పంజా చూపించాడు. బాలీవుడ్ లో కూడా సాహో తొలిరోజు వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. హింది వర్షన్ బాలీవుడ్ లో 24.40 కోట్ల దాకా వాసూళు చేసినట్టు తెలుస్తుంది.
బాలీవుడ్ లో మొదటిరోజు కలక్షన్స్ చేసిన సినిమాల్లో సాహో 3వ స్థానం సంపాదించుకుంది. ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లో సాహో జోరు కొనసాగుతుంది. నైజాం ఏరియాలో బాహుబలి 2 రికార్డులను కూడా కొల్లగొట్టింది సాహో. నైజాంలో సాహో తొలిరోజు 9.50 కోట్లు రాబట్టింది. ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏపి/తెలంగాణా కలిపి 36 కోట్ల పైగా వసూళ్లు తెచ్చుకుంది సాహో.
వరల్డ్ వైడ్ గా నిన్న మొత్తం సాహో ఫీవర్ ఉందని చెప్పొచ్చు. అయితే టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వస్తున్నాయి. 300 కోట్ల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ నిర్మించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందించారు.