అమెరికాలో ఆరోస్థానంలో సాహో..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో శుక్రవారం రిలీజైన సినిమా సాహో. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి షో నుండి మిక్సెడ్ టాక్ తో నడుస్తుంది. యూఎస్ లో ప్రీమియర్స్ తో సాహో 9,15,224 డాలర్లు వసూళు చేసిందని తెలుస్తుంది. ఓవర్సీస్ లో ఈ మూవీని భారీ మొత్తానికి కొన్నారు. వారికి ఈ వసూళ్లు షాక్ అయ్యేలా చేస్తున్నాయి. అమెరికాలో ప్రీమియర్ కలక్షన్స్ లో సాహో ఆరో స్థానంలో నిలిచింది.     

యూఎస్ ప్రీమియర్స్ తో సత్తా చాటిన సినిమాల లిస్ట్ చూస్తే బాహుబలి 2 మూవీ 2.4 మిలియన్ డాలర్స్ వసూళు చేయగా.. అజ్ఞాతవాసి 1.52 మిలియన్ డాలర్స్ రాబట్టింది. బాహుబలి ది బిగినింగ్ మూవీ 1.39 మిలియన్ డాలర్లు వసూళు చేయగా మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150 1.29 మిలియన్ డాలర్స్ రాబట్టింది. ఆ తర్వాత స్పైడర్ 1.00 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ఇక ఆరవ స్థానంలో సాహో 91,50,000 డాలర్స్ రాబట్టింది.  

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాగా సాహోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్ బాగున్నా కథ, కథనాలు రొటీన్ గా అనిపించడం వల్ల టాక్ పెద్దగా బాగాలేదు. తెలుగు రెండు రాష్ట్రాల్లో సాహో ఫస్ట్ డే 36 కోట్లను వసూళు చేసింది.