
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కాబట్టి భారీ బడ్జెట్ తో తీయాలని అనుకున్నారో ఏమో కాని ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడితో చాలా పెద్ద సాహసమే చేశాడు ప్రభాస్. బాహుబలితో వచ్చిన నేషనల్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకునేలా ప్రభాస్ సాహో చేశాడు. కాని ఈరోజు రిలీజైన సినిమా చూస్తే సీన్ రివర్స్ అయ్యిందని తెలుస్తుంది. ముఖ్యంగా సుజిత్ రాసుకున్న కథ చాలా నార్మల్ గా ఉండటమే కాకుండా ఆ కథకు ఇలాంటి బడ్జెట్ పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.
తెలుగులో ఆల్రెడీ వచ్చిన కథకు అనవసరమైన ఆర్భాటాల కోసం 350 కోట్ల బడ్జెట్ పెట్టారు యువి క్రియేషన్స్. కథ, కథనాలు లేకున్నా కేవలం యాక్షన్ సీన్స్ తో సినిమా ఆడించేద్దామని అనుకున్నారు. రన్ రాజా రన్ సినిమాతో ప్రతిభ చాటిన సుజిత్ కు సాహో లాంటి పెద్ద ప్రాజెక్ట్ ఇస్తే ఇలా చేశాడేంటని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. కథలో దమ్ము లేకుండా భారీతనం ఎంత ఉన్నా భారీ యాక్షన్స్ ఎన్ని ఉన్నా సినిమాను కాపాడలేవు. సాహో ఫస్ట్ షో నుండి డివైడ్ టాక్ వచ్చింది. మరి ఈ టాక్ కలక్షన్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది.