
టచ్ చేసి చూడు, నేల టికెట్టు, అమర్ అక్బర్ ఆంటోని వరుసగా హ్యాట్రిక్ ఫ్లాపులతో కెరియర్ లో వెనుకపడ్డ రవితేజ ప్రస్తుతం డిస్కో రాజా సినిమా చేస్తున్నాడు. విఐ ఆనంద్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తన్యా హోప్ ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ నటిస్తున్నారు. రీసెంట్ గా సినిమాలో రవితేజ ప్రీ లుక్ తో ఇంప్రెస్ చేయగా ఈ సోమవారం డిస్కో రాజా ఫస్ట్ లుక్ వస్తుందని తెలుస్తుంది.
ఈ మూవీని డిసెంబర్ 20న రిలీజ్ ఫిక్స్ చేశారట. క్రిస్ మస్ కానుకగా డిస్కో రాజా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తుంది. ఎక్కడికిపోతవు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న విఐ ఆనంద్ ఆ తర్వాత తీసిన ఒక్క క్షణంతో నిరాశపరచినా డిస్కో రాజాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.