నిర్మాతకు ఇల్లు కొనిచ్చిన రజిని

సూపర్ స్టార్ రజినికాంత్ హృదయం ఎంత గొప్పదో మరోసారి ప్రూవ్ అయ్యింది. రీసెంట్ గా నిర్మాత కలైగ్నననమ్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న రజిని ఆయన పరిస్థితి తెలుసుకుని కలైగ్నననమ్ కు సాయం చేశారు. సన్మాన సభలో నటుడు నిర్మాత శివ కుమార్ కలైగ్నననమ్ దీన స్థితి గురించి సభలో ప్రస్థావించారు. కనీసం సొంత ఇల్లు లేక అద్దె ఇంటిలో ఉంటున్నారన్న విషయం కూడా చెప్పారు.               

అదే సభలో రజిని మాట్లాడుతూ తనతో భైరవి అనే సినిమా కలైగ్నననమ్ నిర్మించారు. తనకు ఎంతో ఇష్టమైన సినిమాల్లో భైరవి ఒకటని. ఈ సందర్భంగా ఆయనకు ఇల్లు కొనిచ్చే అవకాశం ప్రభుత్వం కన్నా ముందు తాను చేస్తానని అన్నారు. అన్నట్టుగానే కలైగ్నననమ్ కు రజిని కోటి రూపాయలతో ఓ ఇల్లు కొనిచ్చారట. ఏదైనా చెప్పింది చేయడంలో రజిని స్టైలే వేరు. రజిని చేసిన ఈ పనికి రజిని ఫ్యాన్స్ ఆయనపై మరింత ఇష్టాన్ని పెంచుకున్నారు.