విజయ్ దేవరకొండ వెరైటీ టైటిల్

యువ హీరో విజయ్ దేవరకొండ ఓ పక్క హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరో పక్క నిర్మాతగా కూడా మారేందుకు సిద్ధమయ్యాడు. కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ సినిమాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా ఓ ప్రయోగాత్మక సినిమా వస్తుందట. సినిమాలో హీరో.. హీరోయిన్ అని కాకుండా కొత్త కాన్సెప్ట్ తో వస్తుందట. తరుణ్ భాస్కర్, అనసూయ ఈ మూవీలో లీడ్ రోల్స్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ మూవీకి టైటిల్ గా మీకు మాత్రమే చెప్తా అని ఫిక్స్ చేశారట. కాన్సెప్ట్ ఏమో కాని టైటిల్ మాత్రం విచిత్రంగా ఉంది. మరి సినిమా కూడా టైటిల్ లానే వెరైటీగా ఉంటుందా.. సినిమా జానర్ ఏంటి అన్న వివరాలు తెలియాల్సి ఉంది. రీసెంట్ గా డియర్ కామ్రేడ్ సినిమాతో నిరాశపరచిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఫైటర్ మూవీ లైన్ లో ఉంచాడు రౌడీ హీరో.