ఆది సాయికుమార్ 'జోడీ' ట్రైలర్.. సింపుల్ అండ్ ఇంప్రెసివ్..!

ఆది సాయి కుమార్ హీరోగా విశ్వనాథ్ అరిగెల డైరక్షన్ లో వస్తున్న సినిమా జోడి. భావన క్రియేషన్స్ లో శ్రీనివాస్ గుర్రం నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా నాని సరసన జెర్సీ సినిమాలో నటించి మెప్పించిన శ్రద్ధ శ్రీనాథ్ జోడి సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. 

సినిమా కథ కొత్తగా లేకున్నా స్క్రీన్ ప్లే బాగానే నడిపించాడని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. భారీ కాస్టింగ్ తో వస్తున్న ఈ జోడి అయినా ఆది సాయికుమార్ కు మంచి హిట్ ఇస్తుందేమో చూడాలి. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు ఫణి కళ్యాణ్. ప్రైవేట్ ఆల్బం నీవేతో సంగీత ప్రియులకు బాగా పరిచయమైన ఫణి కళ్యాణ్ మొదటి ప్రయత్నంగా జోడి సినిమా చేస్తున్నాడు. ట్రైలర్ లో మ్యూజిక్ తో తన మార్క్ వేసుకున్న ఫణి సినిమాలో కూడా ది బెస్ట్ ఇచ్చి ఉంటాడని చెప్పొచ్చు. న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ జోడి సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.