ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఏంటో..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు ఊహించని హిట్ ఇచ్చింది ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా రామ్ రెగ్యులర్ హిట్ సినిమాలకు డబుల్ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు ఒకరిద్దరు దర్శకుల కథలను విని ఆలోచిద్దాం అని చెప్పిన రామ్ ఇప్పుడు వాటిని వద్దని చెప్పాడట. ఇద్దరు నిర్మాతలకు ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేశాడని తెలుస్తుంది.  

మాములుగా హిట్ పడిన వెంటనే ఆ తర్వాత సినిమా కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే హీరో కెరియర్ సెట్ అవుతుంది. రామ్ ప్రతి హిట్ సినిమా తర్వాత తొందరపాటు నిర్ణయంతో కెరియర్ లో వెనక్కి పడ్డాడు. మరి ఈసారైనా సరే ఇస్మార్ట్ శంకర్ తర్వాత దాన్ని మించే సినిమాతో వస్తాడో లేదో చూడాలి. అలా చేయాలంటే రామ్ మళ్లీ స్టార్ డైరక్టర్ తోనే సినిమా చేస్తే బాగుంటుంది. మరి రామ్ నెక్స్ట్ సినిమా ఏదై ఉంటుందో చూడాలి.