
ఆరెక్స్ 100తో యూత్ ఆడియెన్స్ లో ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ సినిమా తర్వాత ఇకమీదట అలాంటి సినిమాలు చేయను తన దగ్గరకు అలాంటి కథలే తెస్తున్నారంటూ చెప్పుకొచ్చింది. రవితేజతో డిస్కో రాజా, వెంకటేష్ తో వెంకీమామ సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఆర్డిఎక్స్ లవ్ సినిమా కూడా చేస్తుంది. శంకర్ భాను నిర్మిస్తున్న ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
తేజూస్, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ చూస్తే ఇది పక్కా యూత్ ఆడియెన్స్ కోసం తీసిన సినిమా అని చెప్పొచ్చు. అడల్ట్ డోస్ ఎక్కువైనట్టుగా సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నాయి. అర్జున్ రెడ్డి తర్వాత ఈ తరహా సినిమాలు ఎక్కువయ్యాయి. అయితే ఆ సినిమాలో బలమైన క్యారక్టరైజేషన్ వల్ల సినిమా ఆడింది కాని లిప్ లాక్స్ వల్లే ఆడిందని మిగతా వారంతా అదే పంథాలో సినిమాలు చేస్తున్నారు. ఆర్డిఎక్స్ లవ్ బీ గ్రేడ్ సినిమాలా తలపించేలా ఉంది.