
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. 2020 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా తర్వాత మహేష్ ఏ డైరక్టర్ తో చేస్తాడన్న కన్ ఫ్యూజన్ ఏర్పడింది. త్రివిక్రం, సుకుమార్ లతో చేయాల్సి ఉన్నా సుకుమార్ మహేష్ కోసం వెయిట్ చేయలేక బన్నితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.
ఇక త్రివిక్రం అల వైకుంఠపురములో తర్వాత మళ్లీ ఎన్.టి.ఆర్ తో ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇక మహేష్ 27వ సినిమా రేసులో సందీప్ వంగ కూడా ఉన్నాడు కాని అతను చెప్పిన లైన్ మహేష్ కు పెద్దగా నచ్చలేదట. ఇదిలాఉంటే మహేష్ తర్వాత సినిమా పరశురాం డైరక్షన్ లో వస్తుందని తెలుస్తుంది. పరశురాం మహేష్ కోసం ఓ అద్భుతమైన కథ సిద్ధం చేశాడట. ఈ సినిమా జనవరిలో మొదలవుతుందని తెలుస్తుంది. పరశురాం డైరక్షన్ లో సినిమాను కొరటాల శివ, మైత్రి మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్నారని టాక్.