ఒకే వేదికపై పవన్ మహేష్..!

తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలు పవన్, మహేష్ ఇద్దరు ఒకే వేదికపై కనిపిస్తే ఇక ఆ సీన్ ఎలా ఉంటుంది. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అర్జున్ సినిమా పైరసీ విషయంలో మహేష్ కు సపోర్ట్ గా నిలిచాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వారిద్దరు కలిసింది లేదు. అయితే వాళ్లిద్దరు కలిసే ఓ అరుదైన వేడుక జరుగబోతుంది. తెలుగు సిని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు.

సెప్టెంబర్ 8న హైదరాబాద్ లో ఈ ఈవెంట్ జరుగనుంది. ఈ వేడుకకు పవన్ మహేష్ ఇద్దరిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించారట. పవన్ మహేష్ ఇద్దరు ఈవెంట్ కు వచ్చేందుకు ఓకే చెప్పారట. 15 ఏళ్ల తర్వాత కలుస్తున్న ఈ స్టార్ హీరోల ఇద్దరు ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో భారీస్థాయిలో ఈ కార్యక్రం ప్లాన్ చేస్తున్నారట. పవన్ మహేష్ లతో పాటుగా ఇండస్ట్రీ నుండి దర్శకులు, నిర్మాతలు, 24 క్రాట్స్ కు సంబందించిన సిని ప్రముఖులు అటెండ్ అవుతారని తెలుస్తుంది.