నాని గ్యాంగ్ లీడర్ ట్రైలర్.. అదిరిపోయిందిగా..!

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. లక్ష్మి, శరణ్య వంటి సీనియర్ నటీమణులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఐదుగురు ఆడవాళ్లు వాళ్లు చంపాలనుకునే విలన్ వాళ్లకు సపోర్ట్ చేసే హీరో.. ఓ రివెంజ్ రైటర్ గా పనిచేసే హీరో ఆడవాళ్ల గ్యాంగ్ లీడర్ ఎలా అయ్యాడు.. వారి రివెంజ్ ఎలా తీర్చాడు అన్నది సినిమా కథ.  

ట్రైలర్ చూస్తే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. స్క్రీన్ ప్లే విషయంలో విక్రం కె కుమార్ కు మంచి పట్టు ఉంది.. గ్యాంగ్ లీడర్ ట్రైలర్ చూస్తేనే అది అర్ధమవుతుంది. నాని ఆడవాళ్ల గ్యాంగ్ అంతా కలిసి చేసే అల్లరి ఆడియెన్స్ ను అలరించేలా ఉంది. ఇక ఈ సినిమాలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే విలన్ గా ఆరెక్స్ 100 హీరో కార్తికేయ నటించడమే. హీరోగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న కార్తికేయ ఇలా విలన్ గా సాహసం చేయడం గొప్ప విషయం. ట్రైలర్ లో కనిపించిన 3 సార్లు అతను అదరగొట్టాడు. సెప్టెంబర్ 13న రాబోతున్న నాని గ్యాంగ్ లీడర్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.