జస్ట్ ఫీవరే.. డోంట్ వర్రీ..!

కింగ్ నాగార్జున ఆరోగ్యం గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈమధ్యనే మన్మథుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఆ సినిమాలో లుక్ బాగుండటం కోసం బాగా వర్క్ అవుట్స్ చేశారు. అంతేకాదు షూటింగ్ టైంలో ఆయన రైట్ షోల్డర్ కు గాయం కూడా అయ్యిందట. ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న నాగార్జునకు ఆరోగ్యం సరిగా లేదన్న వార్తలు వచ్చాయి.

అయితే మీడియా దగ్గరకు వస్తే ఎంత చిన్న వార్త అయినా పెద్దదవుతుంది. అలానే నాగార్జున తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ బిగ్ బాస్ లోకి నాగార్జున బదులుగా బాలయ్య వస్తారంటూ ఏవేవో వార్తలు వచ్చాయి. దీని గురించి అక్కినేని ఫ్యాన్స్ కూడా కాస్త ఆందోళన పడుతున్నారు. అందుకే అక్కినేని ఫ్యాన్స్ కోసం నాగర్జున సన్నిహితుల నుండి ఓ సమాచారం అందించారట. తనకు వచ్చింది జస్ట్ వైరల్ ఫీవరే అని దానికి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని నాగార్జున తన ఫ్యాన్స్ కు సందేశాన్ని పంపించారట. మొత్తానికి నాగార్జున ఫీవర్ తో బాధపడుతుంటే ఆయనకేదో అయిపోయిందంటూ మీడియా హంగామా చేసింది.