సాహో నిర్మాతల చేతుల్లో సైరా..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న ప్రెస్టిజియస్ మూవీ సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మించాడు. అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరుగుతుంది. సైరా సినిమా నైజాం రైట్స్ యువి క్రియేషన్స్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. రాం చరణ్ కు స్నేహితులైన యువి క్రియేషన్స్ వంశీ, శ్రీధర్ లు సైరాను 30 కోట్లకు కొనేశారట. 

కొన్నది యువి వాళ్లే అయినా దిల్ రాజుకే పంపిణీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఆంధ్రాలో 60 కోట్లకు అమ్మేశారని తెలుస్తుంది. ఉత్తరాంధ్ర 16.5 కోట్లు క్రాంతి పిక్చర్స్ కు ఇచ్చినట్టు సమాచారం. మొత్తానికి సాహో ఊపుతో సైరా కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ చేస్తుంది. ఎలా లేదన్నా సైరా కూడా 300 నుండి 400 కోట్ల దాకా బిజినెస్ చేసేలా ఉంది.  

ఇక ఈమధ్య రిలీజైన టీజర్ అంచనాలు పెంచడంతో సినిమా ష్యూర్ షాట్ హిట్ అన్నట్టుగా డిస్ట్రిబ్యూటర్స్ కూడా కాస్త పెద్ద మొత్తంలోనే ఇచ్చి సైరా హక్కులను కొనేస్తున్నారట. మేకింగ్, విజువల్స్, యాక్షన్ వీటితో పాటుగా ఓ వీరుడి కథతో వస్తున్న సైరా కూడా మరోసారి చిరు సత్తా చూపుతుందని అంటున్నారు. మరి ఆ సంచలనాలు చూడాలంటే మాత్రం అక్టోబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.