సరైన కథ దొరకలేదు.. అంతే..!

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత శ్రీదేవి భర్త బోనీ కపూర్ తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ పై వస్తున్న వార్తలను ఖండించారు. జాన్వి కేవలం హింది సినిమాలకే ప్రిఫరెన్స్ ఇస్తుందని.. తెలుగులో స్టార్ సినిమా అవకాశాలు వచ్చినా చేయట్లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన బోనీ కపూర్ తన భార్య శ్రీదేవి సౌత్ నుండి బాలీవుడ్ వచ్చి స్టార్ హీరోయిన్ అయ్యిందని జాన్వికి సరైన అవకాశం రాలేదని.. వస్తే తప్పకుండా తను సౌత్ లో సినిమాలు చేస్తుందని అన్నారు.

తెలుగులో మహేష్, రాం చరణ్ వంటి స్టార్ సినిమా అవకాశాలు వచ్చినా జాన్వి కపూర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న వార్తలు బాగా స్ప్రెడ్ అయ్యాయి. అందుకే బోనీ కపూర్ ఈ విషయంపై కలుగ చేసుకోవాల్సి వచ్చింది. జాన్వీ మాత్రమే చేయగలిగే పాత్ర వస్తే తప్పకుండా ఆమె తెలుగు, తమిళ భాషల్లో నటిస్తుందని చెప్పుకొచ్చారు బోనీ కపూర్. బాలీవుడ్ లో దఢక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జాన్వి వరుస అవకాశాలను అందుకుంటుంది.