విక్రం వేద రీమేక్ లో రవితేజ..!

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ డైరక్షన్ లో డిస్కో రాజా సినిమా చేస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ ఓ రీమేక్ సినిమాకు ఓకే చెప్పాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ రీమేక్ విక్రం వేద సినిమాను రవితేజ హీరోగా చేస్తున్నాడని తెలుస్తుంది.  

అయితే ఈ సినిమాలో డాన్ పాత్రలో ఆరెక్స్ 100 కార్తికేయ నటిస్తాడని టాక్. హీరోగానే కాదు విలన్ గా కూడా సత్తా చాటాలని చూస్తున్న కార్తికేయ నాని హీరోగా వస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. సో ఆ రిఫరెన్స్ తోనే విక్రం వేద సినిమాలో కార్తికేయకు డాన్ రోల్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. రీసెంట్ గా వచ్చిన శర్వానంద్ రణరంగంతో ఫ్లాప్ అందుకున్న సుధీర్ వర్మ రీమేక్ తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.