
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన జిగుర్తండా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా రిలీజ్ ను సెప్టెంబర్ 13న ఫిక్స్ చేశారు. అయితే నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా కూడా అదే రోజున రిలీజ్ అనుకున్నారు. ఆగష్టు 30న సాహో.. అక్టోబర్ 2న సైరా రెండు భారీ బడ్జెట్ సినిమాల మధ్య రాబోతున్న ఈ రెండు సినిమాల గురించి కూడా ఆడియెన్స్ లో మంచి ఇంట్రెస్ట్ ఏర్పడింది.
అందుకే రెండు ఒకేరోజు అయితే కాంపిటీషన్ అనుకున్నారో ఏమో వాల్మీకి సినిమాను వాయిదా వేసుకున్నారు. ఆ విషయాన్ని ఎనౌన్స్ చేస్తూ గ్యాంగ్ లీడర్ నిర్మాతలు మైత్రి మేకర్స్, వాల్మీకి నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచటతో కలిసి దిల్ రాజు స్పెషల్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. గ్యాంగ్ లీడర్, వాల్మీకి రెండు సినిమాల మీద ఆడియెన్స్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రెండు ఒకేరోజు రిలీజ్ అవడం కన్నా వేరు వేరు డేట్లు వస్తే బెటర్ అని రెండు సినిమాల నిర్మాతలు కలిసి నిర్ణయం తీసుకున్నారు. సో సెప్టెంబర్ 13న షెడ్యూల్ ప్రకారంగా నాని గ్యాగ్ లీడర్ రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 20న వరుణ్ తేజ్ వాల్మీకి రిలీజ్ అవుతుందని దిల్ రాజు ఎనౌన్స్ చేశారు.