
గోవా బ్యూటీ ఇలియానా ఒంటరిదైందా.. కొన్నాళ్లుగా లండన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ లో ఉన్న ఇల్లి బేబ్ ఇప్పుడు వారిద్దరు ఎవరి దారి వారు చూసుకున్నట్టుగా తెలుస్తుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను తెచ్చుకున్న ఇలియానా తమిళంలో కూడా సూపర్ పాపులారిటీ అందుకుంది. బాలీవుడ్ ఛాన్స్ రాగానే సౌత్ సినిమాలను వదిలేసి వెళ్లిన ఇలియానా లాస్ట్ ఇయర్ మళ్లీ తెలుగులో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది.
కొన్నాళ్లుగా ఆండ్రూతో దిగిన ఫోటోలతో ట్విట్టర్, ఇన్ స్టాగ్రాంలలో సందడి చేసిన ఇలియానా ఇద్దరి మధ్య ఏమైందో ఏమో కాని ఇలియానా ఇప్పుడు మళ్లీ ఒంటరిగా ఉంటుందని తెలుస్తుంది. ఈమధ్య తన సోషల్ బ్లాగ్స్ లో కూడా సోలోగా ఉన్న పిక్స్ పెడుతూ వస్తుంది ఇలియానా. మరి నిజంగానే ఆండ్రూతో ఇలియానా విడిపోయిందా లేదా అన్నది అఫిషియల్ గా తెలియాల్సి ఉంది. ఇద్దరు పెళ్లి చేసుకోవడమే తరువాయి అన్నట్టుగా చెట్టాపట్టాలేసుకు తిరిగారు సడెన్ గా ఈ గ్యాప్ ఎందుకొచ్చింది అన్న విషయంపై క్లారిటీ రావాలి అంటే ఇలియానా స్పందించాల్సిందే.